అలాంటి ప్రశ్నలు అడగడం నాకు నచ్చదు: యాంకర్ రష్మీ
- పెళ్లి గురించిన ప్రశ్నలు నాకు నచ్చవు
- నా వర్క్ లైఫ్ వేరు .. పర్సనల్ లైఫ్ వేరు
- సహజీవనం అనే ఆప్షన్ ఉందికదా
సుడిగాలి సుధీర్ .. ప్రదీప్ ఈ ఇద్దరిలో ఎవరో ఒకరిని పెళ్లి చేసుకోవలసి వస్తే ఎవరిని చేసుకుంటారు?' అని మరో అభిమాని అడిగాడు. అందుకు రష్మీ స్పందిస్తూ .. 'నా వర్క్ లైఫ్ .. పర్సనల్ లైఫ్ రెండూ వేరు వేరుగా ఉంటాయి. ఇందులో వుండే వ్యక్తులు అందులోకి .. అందులో వుండే వ్యక్తులు ఇందులోకి రావడం జరగదు' అని స్పష్టం చేసింది. 'లవ్ మ్యారేజ్ .. అరేంజ్డ్ మ్యారేజ్ లో దేనిని ఎంపిక చేసుకుంటారు?' అని ఒక అభిమాని అడగ్గా, మధ్యలో 'సహజీవనం' అనే ఆప్షన్ మరొకటి ఉందిగదా' అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చింది.