Vijayashanthi: ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందోనని ప్రజలు వణికిపోతున్నారు: విజయశాంతి

  • అరాచకాలను ఎప్పటికీ సహించబోరు
  • ఎమ్మెల్సీలను అన్యాయంగా లాక్కున్నారు
  • యథారాజా.. తథా ప్రజ అన్నట్టుంది 
టీఆర్ఎస్ పాలనలో ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందోనని ప్రజలు వణికిపోతున్నారని కాంగ్రెస్ నేత విజయశాంతి పేర్కొన్నారు. నేడు ఆమె మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనపై విరుచుకుపడ్డారు. తెలంగాణలో అరాచకాలను ప్రజలు ఎప్పటికీ సహించబోరన్నారు. తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీలను అన్యాయంగా టీఆర్ఎస్‌లోకి లాక్కున్నారని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిస్థితి చూస్తే యథారాజా.. తథా ప్రజ అన్నట్టుందని విజయశాంతి వ్యాఖ్యానించారు.

Vijayashanthi
TRS
Congress
Telangana
Police

More Telugu News