Yami Gowtham: ఇప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచనలు లేవు: యామీ గౌతమ్

  • 2018 పెళ్లి ముహూర్తాలతో నిండిపోయింది
  • పెళ్లికి తొందరేమీ లేదు 
  • అప్పటి వరకూ సింగిల్‌గానే ఉంటా
కథానాయిక యామీ గౌతమ్ తన సహనటుడు పుల్కిత్ సామ్రాట్‌తో ప్రేమలో ఉందనే ప్రచారం చాలా రోజులుగా జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని వీరిద్దరూ ఖండించినప్పటికీ సామ్రాట్ మాజీ భార్య శ్వేతా రోహిరా మాత్రం వాళ్లిద్దరూ డేటింగ్‌లో ఉన్నారని ఆరోపిస్తోంది. తాము విడిపోవడానికి కారణం కూడా యామీయే అని శ్వేత చెబుతోంది.

అయితే ఇటీవల మీడియా యామీని పెళ్లి విషయమై ప్రశ్నించగా, తన వివాహానికి తొందరేమీ లేదని చెప్పింది. ‘2018లో చాలా పెళ్లిళ్లు జరిగాయి. ఇంకెన్ని జరుగుతాయి? ఇప్పటికే క్యాలెండర్ పెళ్లి ముహూర్తాలతో నిండిపోయి, మీడియాను చాలా బిజీ చేసింది. కాబట్టి దయచేసి ఇప్పుడు నన్ను వదిలేయండి. నేను సింగిల్‌. పెళ్లికి ముందు వరకూ నేను సింగిల్‌గానే ఉంటాను. ఇప్పుడు నాకు పెళ్లి చేసుకునే ఆలోచనలు లేవు’ అని యామీ తెలిపింది.
Yami Gowtham
Pulakith Samrat
Swetha Rohira
Marriage

More Telugu News