venkatesh: 'ఎఫ్ 2' నుంచి సెకండ్ సింగిల్ వచ్చేస్తోంది

  • అనిల్ రావిపూడి నుంచి 'ఎఫ్ 2'
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ 
  • జనవరి 12వ తేదీన విడుదల

అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 2' సినిమా నిర్మితమైంది. పూర్తి వినోదభరితంగా రూపొందిన ఈ సినిమాలో వెంకటేశ్ సరసన తమన్నా .. వరుణ్ తేజ్ జోడీగా మెహ్రీన్ నటించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇటీవల వదిలిన ఫస్టు సింగిల్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో రేపు ఉదయం 11 గంటలకి, 'ఎంతో ఫన్ .. ' అంటూ సాగే సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నారు.

దేవిశ్రీ స్వరపరిచిన ఈ సాంగ్ కూడా జోరుగా .. హుషారుగా కొనసాగుతుందని అంటున్నారు. ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన పోస్టర్స్ కి .. టీజర్ కి .. సాంగ్ కి మంచి రెస్పాన్స్ రావడంతో, తప్పకుండా హిట్ కొడుతుందనే నమ్మకంతో టీమ్ వుంది. వాళ్ల నమ్మకాన్ని నిలబెడుతూ, సంక్రాంతి బరిలో ఈ సినిమా సక్సెస్ ను సొంతం చేసుకుంటుందేమో చూడాలి. 

More Telugu News