South Central Railway: తెలంగాణకు 19 కొత్త రైళ్లు... జాబితా ఇదిగో!

  • తెలంగాణ నుంచి బయలుదేరే 10 కొత్త రైళ్లు
  • రాష్ట్రం మీదుగా సాగే మరో 9 దూరప్రాంత రైళ్లు
  • జాబితా విడుదల చేసిన ద.మ.రై

తెలంగాణకు మరిన్ని రైళ్లు రానున్నాయి. రాష్ట్రం నుంచి బయలుదేరేలా 10 జతల కొత్త రైళ్లతో పాటు, రాష్ట్రం మీదుగా వెళ్లే 9 జతల కొత్త రైళ్ల జాబితాను దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసింది. ఇదే సమయంలో 36 రైళ్ల గమ్యస్థానాలను పొడిగించామని, కొన్ని రైళ్ల స్టాపేజ్ లను పెంచామని అధికారులు వెల్లడించారు.

తెలంగాణ నుంచి బయలుదేరే కొత్త ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో కాచిగూడ - నాగర్‌ కోయిల్‌ (16353/16354 కాచిగూడ వీక్లీ), సికింద్రాబాద్‌ - విశాఖపట్నం (12784/12783 సికింద్రాబాద్‌ ఏసీ వీక్లీ), సికింద్రాబాద్‌ - విజయవాడ (12796/12795 సికింద్రాబాద్‌ ఇంటర్‌ సిటీ), హైదరాబాద్‌ - వాస్కోడిగామా (17021/17022 హైదరాబాద్‌ వీక్లీ), హైదరాబాద్‌ - గుల్బర్గా (11308/11307 హైదరాబాద్‌ ఇంటర్‌ సిటీ), కాజీపేట - లోకమాన్య తిలక్‌- టీ (11084-11083 కాజీపేట వీక్లీ), కాజీపేట - లోకమాన్య తిలక్‌ -టీ (22128/22127 కాజీపేట వీక్లీ), మహబూబ్‌నగర్‌ - జక్లేర్‌ (77622/77623 మహబూబ్‌ నగర్‌ బై వీక్లీ డెమో), కాజీపేట్‌ - పూణే (22152/22151 కాజీపేట్‌ వీక్లీ), లింగంపల్లి - ఇండోర్‌ (19316/19315 లింగంపల్లి హమ్‌ సఫర్‌) రైళ్లున్నాయి.
 
ఇక తెలంగాణ మీదుగా రాకపోకలు సాగించే రైళ్లలో ఔరంగాబాద్‌ - రేణిగుంట (17621/17622 ఔరంగాబాద్‌ వీక్లీ), తిరుపతి - సాయినగర్‌ షిరిడీ (17417/17418 తిరుపతి వీక్లీ), తిరుపతి - జమ్ముతావి (22705/22706 తిరుపతి హమ్‌ సఫర్‌), విశాఖపట్నం - న్యూఢిల్లీ (22415/22416 విశాఖపట్నం ఏపీ ఎక్స్‌ ప్రెస్‌), యశ్వంతపూర్‌ - టాటానగర్‌ (18112/18111 యశ్వంతపూర్‌ వీక్లీ), మన్నార్‌ గుడి - జోధ్‌ పూర్‌ (16864/16863 మన్నార్‌ గుడి వీక్లీ),  రామేశ్వరం - ఫైజాబాద్‌ (16793/16794 రామేశ్వరం వీక్లీ), భగత్‌ కోఠి - తాంబరం (14815/14816 భగత్‌ కోఠి హమ్‌ సఫర్‌), అజ్మీర్‌ - రామేశ్వరం (19603/19604 అజ్మీర్‌ హమ్‌ సఫర్‌) రైళ్లున్నాయి.

More Telugu News