asaduddin owaisi: ఇమ్రాన్ ఖాన్ పై విరుచుకుపడ్డ అసదుద్దీన్ ఒవైసీ

  • మైనార్టీ హక్కుల గురించి భారత్ నుంచి మీరే నేర్చుకోవాలి
  • ముస్లిం వ్యక్తి మాత్రమే పాక్ అధ్యక్షుడు కాగలరు
  • మా దేశంలో అణగారిన వర్గాల వారు ఎందరో రాష్ట్రపతులు అయ్యారు
భారత్ పై పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. మైనార్టీలను ఎలా చూసుకోవాలో తమ ప్రభుత్వం భారత్ కు చూపిస్తోందంటూ ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. భారత్ నుంచి పాకిస్థాన్ నేర్చుకోవాల్సింది చాలా ఉందని ఒవైసీ అన్నారు. మైనార్టీ హక్కుల గురించి భారత్ నుంచి పాకిస్థాన్ నేర్చుకోవాలని అన్నారు.

పాకిస్థాన్ రాజ్యాంగం ప్రకారం కేవలం ముస్లిం వ్యక్తి మాత్రమే అధ్యక్షుడు కాగలడని... భారత్ లో అణగారిన వర్గాల నుంచి వచ్చిన ఎందరో రాష్ట్రపతి పదవిని చేపట్టారని చెప్పారు. మైనార్టీల హక్కులు, సమ్మిళిత రాజకీయాల గురించి మా దేశం నుంచి ఖాన్ సాబ్ నేర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఒవైసీ స్పందించారు.
asaduddin owaisi
mim
imran khan
pakistan
Prime Minister

More Telugu News