chattisgarh: అబ్బో...ఆ జైలు క్యాంటీన్‌లో పకోడీ భలే రుచి మరి!

  • ఖైదీలు నిర్వహించే అల్పాహార కేంద్రంలో తయారీ
  • కొనుగోలు కోసం రోజూ వందలాది మంది జైలుకు క్యూ
  • బిలాస్‌పూర్‌ పట్టణంలోనే ఫేమస్ అని టాక్‌

అదో కేంద్ర కారాగారం. నిత్యం వందలాది మంది ఆ జైలుకు వస్తుంటారు. అదేంటి ఆ స్థాయిలో నేరాలు జరుగుతున్నాయా? అని చూసే వారు కంగారు పడొచ్చు. కానీ వారెవరూ ఖైదీలు కాదు. జైలులో శిక్ష అనుభవిస్తున్న వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్యాంటీన్‌లో పకోడీ, జిలేబీ వంటి చిరుతిళ్ల కొనుగోలు కోసం వచ్చే వినియోగదారులు. జైలు క్యాంటీన్‌లో పదార్థాలకు ఇంత డిమాండా అని ఆశ్చర్యపోతున్నారా? అయితే ఒక్కసారి చత్తీస్‌గఢ్‌ లోని బిలాస్‌పూర్‌ సెంట్రల్‌ జైలుకు వెళితే ఇది ఎంత వాస్తవమో మీకే అర్థమవుతుంది.

వివరాల్లోకి వెళితే...బిలాస్‌పూర్‌ సెంట్రల్‌ జైలులో ఖైదీల ఆధ్వర్యంలో ఓ క్యాంటీన్‌ నడుస్తోంది. ఖైదీలకు స్వయం ఉపాధిలో భాగంగా పది నెలల క్రితం జైలు అధికారులు ఈ అల్పాహార కేంద్రాన్ని ప్రారంభించేందుకు అనుమతినిచ్చారు. ఈ క్యాంటీన్‌లో ఉదయం, సాయంత్రం పూట పకోడీ, ఆలూబోండా, జిలేబీ తయారు చేస్తారు. వీటిని కొనుగోలు చేసేందుకు జైలు పరిసరాల్లోని వందలాది మంది వినియోగదారులు నిత్యం క్యూ కడుతుంటారు. అంతేకాదు సుదూర ప్రాంతాల నుంచి కూడా వినియోగదారులు వచ్చి పకోడీ కొనుగోలు చేస్తుండడం విశేషం.  అదేం అంటే ఇంత రుచికరమైన పకోడీ బిలాస్‌పూర్‌ పట్టణంలోనే ఎక్కడా లభించదని చెబుతారు.

More Telugu News