Nayanatara: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • 'లేడీ టైగర్'గా వస్తున్న నయనతార 
  • విజయ్ ఆంటోని హీరోగా 'జ్వాల'
  • బాలకృష్ణకు మహేశ్ ప్రశంసలు

*  ఎనిమిదేళ్ల క్రితం నయనతార తమిళంలో నటించిన 'ఎలక్ట్రా' చిత్రాన్ని తెలుగులోకి 'లేడీ టైగర్' పేరిట డబ్ చేస్తున్నారు. ప్రకాశ్ రాజ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రాన్ని ఈ నెల 29న తెలుగు రాష్ట్రాలలో విడుదల చేయనున్నారు.
*  'బిచ్చగాడు' ఫేం విజయ్ ఆంటోని తెలుగులో నటిస్తున్న 'జ్వాల' చిత్రం షూటింగ్ నిన్న హైదరాబాదులో మొదలైంది. నవీన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శాలిని పాండే హీరోయిన్ గా నటిస్తోంది.
*  నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 'ఎన్టీఆర్' బయోపిక్ కు సంబంధించిన ట్రైలర్ కు విశేషమైన ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ క్రమంలో హీరో మహేశ్ బాబు కూడా ప్రశంసలు కురిపించాడు. ఎన్టీఆర్ పాత్రలో బాలకృష్ణ నమ్మశక్యం కానంతగా ఒదిగిపోయారని, ఈ ట్రైలర్ మొత్తం అద్భుతంగా వుందని కాంప్లిమెంట్స్ ఇచ్చాడు.

More Telugu News