vijay sethupathi: క్రిస్మస్ కి గట్టిపోటీ .. మరో హిట్ కొట్టేసిన విజయ్ సేతుపతి!

  • '96' మూవీ బ్లాక్ బస్టర్ హిట్ 
  • రీసెంట్ గా వచ్చిన 'సీతా కత్తి'
  • 70 యేళ్ల వృద్ధుడిగా సేతుపతి 

ఇటీవల విజయ్ సేతుపతి చేసిన '96' మూవీ భారీ విజయాన్ని సాధించింది. విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకుని, విజయ్ సేతుపతిని మరో మెట్టు పైకి చేర్చింది. ఈ సినిమా సక్సెస్ ను ఆడియన్స్ మరిచిపోకమునుపే విజయ్ సేతుపతి మరో విజయాన్ని అందుకున్నాడు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయన తాజా చిత్రంగా 'సీతా కత్తి' ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

దాదాపు 8 సినిమాలతో పోటీపడుతూ ఈ సినిమా అక్కడ విడుదలైంది. ఈ పోటీలో ధనుశ్ 'మారి 2' కూడా వుంది. ఈ సినిమాలన్నింటిలో 'సీతాకత్తి' మంచి మార్కులు కొట్టేసింది. 'భారతీయుడు' సినిమాలో సీనియర్ కమలహాసన్ లుక్ కి దగ్గరగా ఆయన ఈ సినిమాలో కనిపిస్తాడు. కథాబలం .. విజయ్ సేతుపతి నటన బలంతోనే ఈ సినిమాకి మార్కులు పడిపోతున్నాయని తెలుస్తోంది. 70 యేళ్లు పైబడిన వృద్ధుడి పాత్రలో సేతుపతి అదరగొట్టేశాడని అంటున్నారు. నిస్సందేహంగా ఈ క్రిస్మస్ విజేత విజయ్ సేతుపతినే అని చెబుతున్నారు. 

More Telugu News