మాకు నైతిక విలువలు ఉన్నాయి.. అందుకే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నా!: కొండా మురళి
- స్వామిగౌడ్ కు రాజీనామా ఇచ్చిన మురళి
- షోకాజ్ నోటీసు పంపిస్తామని బెదిరించారని వ్యాఖ్య
- కాంగ్రెస్ నేతలను ప్రలోభపెడుతున్నారని ఆరోపణ
కానీ టీఆర్ఎస్ పార్టీ మాత్రం కాంగ్రెస్ ఎమ్మెల్సీలను ప్రలోభపెట్టి తమ పార్టీలో చేర్చుకున్నారనీ, పార్టీని విలీనం చేసుకున్నారని ఆరోపించారు. తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దురహంకారపూరితంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లేవారికి తొలుత ఇంటికి పిలిచి భోజనం పెడతారనీ, ఆ తర్వాత మాత్రం అపాయింట్ మెంట్ కూడా ఇవ్వరని ఎద్దేవా చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లోకి పోతున్న వాళ్లంతా ఆత్మాభిమానం చంపుకునే వెళుతున్నారని వ్యాఖ్యానించారు.