చంద్రబాబుపై నాకు చాలా కోపం ఉంది.. డబ్బులుంటే ఆయనపై 1996లోనే సినిమా తీసేదాన్ని!: లక్ష్మీ పార్వతి
- వర్మ నన్ను ఇంతవరకూ కలవలేదు
- నా అభిప్రాయాన్ని తీసుకోలేదు
- నగదు లేకపోవడంతోనే సినిమా తీయలేకపోయా
‘ఒకవేళ నిజంగా అన్ని డబ్బులు నా దగ్గర ఉంటే 1996లోనే చంద్రబాబుపై సినిమా తీసేదాన్ని’ అని వ్యాఖ్యానించారు. చంద్రబాబుపై తనకు అంత కోపం ఉందన్నారు. ఓ టీవీ ఛానల్ లో జరిగిన చర్చా కార్యక్రమంలో లక్ష్మీ పార్వతి ఈ వ్యాఖ్యలు చేశారు. కేవలం ఆర్థిక నిస్సహాయత కారణంగానే తాను మౌనంగా ఉండిపోయానన్నారు. ఇప్పుడెవరో వచ్చి లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను నిర్మిస్తూ ఉంటే దాన్ని తనకు అంటగట్టడం భావ్యం కాదన్నారు.