తమిళనాడులో రజనీ జోరు.. మూడు టీవీ ఛానల్స్ పెట్టనున్న సూపర్ స్టార్!
- పేర్లను రిజిస్టర్ చేయించిన రజనీ ప్రతినిధులు
- త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశం
- తమిళనాడులో చురుగ్గా రజనీ పావులు
రజనీకాంత్ టీవీ, సూపర్ స్టార్ టీవీ, తలైవా టీవీ పేరుతో మూడు ఛానల్స్ ను ఆయన ప్రారంభిస్తారని తెలుస్తోంది. వీటికి సంబంధించిన లోగోలను కూడా రజనీ ప్రతినిధులు రిజిస్టర్ చేయించినట్లు ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. త్వరలోనే దీనికి సంబంధించి అధికార ప్రకటన వెలువరిస్తామని పేర్కొన్నాయి.