modi: మోదీని తప్పించండి.. ప్రధాని అభ్యర్థిగా గడ్కరీని నిలపండి: ఆర్ఎస్ఎస్ కు మహారాష్ట్ర రైతు నాయకుడి డిమాండ్

  • ప్రభుత్వం, బీజేపీలో నియంతృత్వ ధోరణి ఎక్కువైంది
  • ఈ ధోరణి పార్టీకి, ప్రభుత్వానికి ప్రమాదకరం
  • అహంకార ధోరణి వల్లే మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారం కోల్పోయింది

త్వరలో జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని మోదీని నాయకత్వం నుంచి తప్పించి, ఆ స్థానంలో నితిన్ గడ్కరీని నిలపాలని మహారాష్ట్ర రైతు నేత, వసంతరావు నాయక్‌ సేఠ్ స్వావలంబన్‌ మిషన్‌ చైర్మన్‌ కిశోర్‌ తివారి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు లేఖ రాశారు. బీజేపీ నేతల అహంకార ధోరణి వల్లే ఇటీవల జరిగిన ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారం కోల్పోయిందని లేఖలో పేర్కొన్నారు.

ఇటు పార్టీలో, అటు ప్రభుత్వంలో తీవ్రవాద, నియంతృత్వ ధోరణి ఎక్కువైందని విమర్శించారు. ఈ ధోరణి పార్టీకి, ప్రభుత్వానికి ప్రమాదకరమని హెచ్చరించారు. నియంతృత్వ ధోరణి ఉన్న వ్యక్తి స్థానంలో అన్ని వర్గాల ప్రజలకు దగ్గరగా ఉండే ఉదారవాదిని రంగంలోకి దింపాల్సిన సమయం ఆసన్నమైందని చెప్పారు. ప్రధాని అభ్యర్థిగా నితిన్ గడ్కరీకి అన్ని అర్హతలు ఉన్నాయని తెలిపారు.

More Telugu News