sushma swaraj: సుష్మా స్వరాజ్ ను కలిసిన హమీద్ కుటుంబం.. అతని తల్లి భావోద్వేగం!

  • హమీద్ ని భారత్ కు అప్పగించిన పాక్ అధికారులు
  • సుష్మా స్వరాజ్ ను కలిసిన హమీద్ కుటుంబసభ్యులు
  • ఆత్మీయంగా పలకరించిన సుష్మా స్వరాజ్

2012లో ఆన్ లైన్ లో పరిచయమైన పాకిస్థానీ అమ్మాయిని కలిసేందుకు అక్రమంగా ఆ దేశంలోకి చొరబడ్డ భారత జాతీయుడు హమీద్ నిహల్ అన్సారీకి ఆ దేశపు మిలిటరీ కోర్టు విధించిన మూడేళ్ల జైలు శిక్ష ఈ నెల 15 తో ముగిసింది. కానీ, న్యాయపరమై పత్రాలు ఇంకా సిద్ధం కాలేదన్న కారణంతో వెంటనే అతన్ని విడుదల చేయలేదు. అతన్ని పాక్ నుంచి భారత్ కు తీసుకువచ్చేందుకు మన అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించడంతో నిన్న అత్తారి-వాఘా సరిహద్దులో హమీద్ నిహల్ అన్సారీని అప్పగించారు.

ఈ నేపథ్యంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ను హమీద్ కుటుంబసభ్యులు ఈరోజు కలిశారు. హమీద్ కుటుంబసభ్యులకు సుష్మా స్వరాజ్ ఆత్మీయ స్వాగతం పలికారు. హమీద్ ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా హమీద్ తల్లి ఫౌజియా భావోద్వేగం చెందారు. తన కుమారుడు సురక్షితంగా భారత్ కు చేరేలా చేసినందుకు ఆమెకు కృతఙ్ఞతలు తెలిపారు. ‘నా భారతదేశం చాలా గొప్పది. మా మేడమ్ చాలా గొప్పవారు. మీరే ప్రతిదీ చేశారు. ఎంతో సంతోషంగా ఉన్నా..’ అంటూ ఫౌజియా ఆనందం వ్యక్తం చేశారు. 

More Telugu News