Zareen Khan: అతడి చెంప పగలగొట్టిన మాట నిజమే.. ఎందుకు కొట్టానంటే..!: వెల్లడించిన నటి జరీన్ ఖాన్

  • ఔరంగాబాద్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన జరీన్ ఖాన్
  • చూసేందుకు ఎగబడిన జనాలు
  •  తాకేందుకు ప్రయత్నించడంతో చేతికి పనిచెప్పిన నటి

మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో ఇటీవల ఓ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ ఓ వ్యక్తి చెంప చెళ్లుమనిపించింది. తాజాగా ఈ ఘటనపై ఆమె మాట్లాడుతూ.. గుంపులోని కొందరు తనను తాకడానికి ప్రయత్నించారని, ఓ వ్యక్తి తనను ముట్టుకునేందుకు ప్రయత్నించడంతో అతడి చెంప పగలగొట్టానని పేర్కొంది. ఆ తర్వాత వారిని దాటుకుని వెళ్లిపోయానని వివరించింది.

ప్రారంభోత్సవానికి హాజరైన జరీన్‌ను చూడడానికి జనాలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. ఈ క్రమంలో కొందరు అసభ్యంగా ప్రవర్తించారు. పోలీసులను తోసుకుని ఆమెను చుట్టుముట్టారు. దీంతో జరీన్ ఓ వ్యక్తి చెంప పగలగొట్టింది. కాగా, ఇటీవల గోవాలో జరీన్ ఖాన్ ప్రయాణిస్తున్న కారు ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు.

More Telugu News