Andhra Pradesh: ‘బ్లేడుతో గొంతు కోసుకుంటా’ అన్న వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన బండ్ల గణేశ్!

  • గతంలో మీడియా ముందు ఛాలెంజ్
  • కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా
  • లేదంటే ‘7 o clock’ బ్లేడుతో గొంతు కోసుకుంటానని వెల్లడి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి రాకుంటే ‘7 o clock’ బ్లేడుతో గొంతు కోసుకుంటానని కాంగ్రెస్ నేత, సినీ నటుడు బండ్ల గణేశ్ గతంలో ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఎన్నికల తర్వాత సదరు ఛానల్ విలేకరి ఆయన ఇంటికి వెళ్లగా బండ్ల గణేశ్ అందుబాటులోకి రాలేదు. తాజాగా బండ్ల గణేశ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బ్లేడుతో గొంతు కోసుకుంటానన్న వ్యాఖ్యలపై బండ్ల గణేశ్ స్పందించారు.

తొలుత తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఆయన వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. అందరినీ స్వామివారు చల్లగా చూడాలని కోరుకున్నట్లు చెప్పారు. తాను అజ్ఞాతంలో ఉన్నానంటూ ఛానల్స్ లో ప్రచారం జరుగుతోందనీ, తాను ఎలాంటి అజ్ఞాతంలో లేనని స్పష్టం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోవడంతో కొంచెం బాధతో ఉన్నానని తెలిపారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారనీ, టీఆర్ఎస్ ను నమ్మారని వ్యాఖ్యానించారు.

ఎన్నికల సందర్భంగా కోపంతో, ఆవేశంలో వంద మాటలు అంటామనీ, అవి అన్నీ చేయాలని కోరితే ఎలాగని ప్రశ్నించారు. మీడియా ప్రతినిధులు కావాలని కోరితే గొంతు కోసుకుంటానని వ్యాఖ్యానించారు. ఒక ఓటమి రేపటి విజయానికి పునాది అని చెప్పారు. కాంగ్రెస్ నేతలకు, కార్యకర్తలను ఉత్సాహపరిచేందుకు ఆ మాటలు చెప్పాననీ, అయితే ఆ కాన్ఫిడెన్స్ కాస్తా ఓవర్ కాన్ఫిడెన్స్ గా మారిందని వాపోయారు.

More Telugu News