Telangana: తెలంగాణకు గుడ్ న్యూస్.. బీబీనగర్ ఎయిమ్స్‌కు కేంద్రం ఆమోదం

తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం శుభవార్త అందించింది. బీబీనగర్‌లో ఎయిమ్స్ ఆసుపత్రిని నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు సోమవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. రూ. 1028 కోట్లతో నిర్మించనున్న ఈ ఆసుపత్రిలో 100 ఎంబీబీఎస్ సీట్లు, 60 నర్సింగ్ సీట్లు ఉంటాయి. 750 పడకలతో, 15 విభాగాలతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా దీనిని నిర్మిస్తారు. తమిళనాడులోని మధురైలోనూ ఎయిమ్స్ నిర్మించేందుకు ఈ సందర్భంగా కేంద్రం ముందుకొచ్చింది. ఇందుకోసం రూ.1264 కోట్లను ఖర్చు చేయనున్నట్టు తెలిపింది.
Telangana
AIIMS
Bibinagar
Narendra Modi
Tamil Nadu
Madhurai

More Telugu News