Priya warrior: ప్రియా వారియర్ బాలీవుడ్ సినిమా ‘శ్రీదేవి బంగ్లా’

  • బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ప్రియా
  • ప్రశాంత్ మాంబుల్లి దర్శకత్వం
  • రూ.70కోట్లతో తెరెకెక్కనున్న చిత్రం

మలయాళ చిత్రం ‘ఒరు అదార్ లవ్’ చిత్రంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ ప్రియా ప్రకాశ్ వారియర్. ఈ చిత్రంలోని ‘మాణిక్య మలరాయ పూవై’ పాటలో అందంగా కన్నుగీటి ఓవర్ నైట్‌లో స్టార్ డమ్ సంపాదించుకుంది. అయితే ఈ చిత్రం విడుదల కాకముందే ఈ అమ్మడు బాలీవుడ్‌లో అడుగు పెట్టేసింది.

ప్రియా వారియర్ నటిస్తున్న తొలి చిత్రానికి ‘శ్రీదేవి బంగ్లా’ అనే టైటిల్‌ను చిత్రబృందం ఖరారు చేసినట్టు సమాచారం. దాదాపు రూ.70 కోట్లతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ నటించిన ‘భగవాన్’ చిత్రం ఫేమ్ ప్రశాంత్ మాంబుల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ కొరియోగ్రాఫర్, నటుడు ప్రభుదేవా కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది.

More Telugu News