Isha Ambani: ఈశా పెళ్లిలో భోజనాలు ఎందుకు వడ్డించాల్సి వచ్చిందో వెల్లడించిన అభిషేక్ బచ్చన్

  • భోజనాలు వడ్డించిన అమితాబ్, అభిషేక్, ఐష్
  • నెట్టింట్లో వైరల్ అయిన ఫోటోలు, వీడియో
  • ప్రశ్నల వర్షం కురిపించిన నెటిజన్లు
ఈశా అంబానీ-ఆనంద్ పిరమాల్‌ల పెళ్లి వేడుక అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ పెళ్లి అనంతరం జరిగిన వివాహ విందులో ఒక విషయం బాగా హైలైట్ అయింది. ఈ వేడుకకు హాజరైన బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ వివాహ విందులో భోజనాలు వడ్డించిన విషయం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేసింది.

దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యాయి. అంత మంది సేవకులుండగా సెలబ్రిటీలు వడ్డించడమేంటని నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు. దీంతో అభిషేక్ ఈ విషయమై ట్విట్టర్ ద్వారా స్పందించారు. ‘ఇలా భోజనాలు వడ్డించే సంప్రదాయాన్ని ‘సజ్జన్‌ ఘోట్’ అంటారు. వధువు తరఫు కుటుంబీకులు వరుడి తరఫు వారికి భోజనాలు వడ్డిస్తారు’ అని సమాధానమిచ్చారు.
Isha Ambani
Anand Piramal
Amitabh Bachchan
Abhishek Bachan
Ishwarya Rai

More Telugu News