syria: సిరియాలోని మసీదును ధ్వంసం చేసిన అమెరికా సంకీర్ణ సేనలు

  • హాజిన్ పట్టణంలోని మసీదు ధ్వంసం
  • బేస్ గా వాడుకుంటున్న ఐసిస్ ఉగ్రవాదులు
  • దాడిలో ప్రాణాలు కోల్పోయిన 16 మంది ఉగ్రవాదులు

అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు సిరియాలోని హాజిన్ పట్టణంలో ఉన్న ఓ మసీదును ధ్వంసం చేశాయి. ఈ మసీదును ఐసిస్ ఉగ్ర సంస్థ తన కమాండ్ కంట్రోల్ సెంటర్ గా ఉపయోగించుకుంటోందని... అందుకే దాన్ని పేల్చి వేశామని అమెరికా సైన్యం తెలిపింది. భారీ ఎత్తున పేలుడు పదార్థాలు, ఆయుధాలు కలిగిన 16 మంది ఐసిస్ ఉగ్రవాదులు ఈ మసీదును బేస్ గా వాడుకుంటున్నారని చెప్పింది. తమ దాడుల్లో ఈ టెర్రరిస్టులంతా ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. ఈ దాడితో ఐసిస్ కు చెందిన కీలకమైన స్థావరాన్ని నాశనం చేశామని చెప్పింది. 

More Telugu News