Telangana Election 2018: ఈసీ పూర్తిగా విఫలమైంది.. హోటళ్లు, లాడ్జీల్లో ఈవీఎంలు పెట్టారు: బీజేపీ నేత లక్ష్మణ్

  • తెలంగాణ ఎన్నికల్లో ప్రజల తీర్పును స్వాగతిస్తున్నాం
  • అసెంబ్లీ ఎన్నికల్లో లక్షల ఓట్లు గల్లంతయ్యాయి
  • స్వయంగా పోలీసులే డబ్బు పంచారు

తెలంగాణ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో లక్షల ఓట్లు గల్లంతయ్యాయని, ఈసీ పూర్తిగా వైఫ్యలం చెందిందని, టీ-బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ విమర్శించారు. హోటళ్లు, లాడ్జీల్లో ఈవీఎంలు పెట్టారని, స్వయంగా పోలీసులే డబ్బు పంచారని ఆరోపించారు.

రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అనవసర ఆరోపణలు చేశారని విమర్శించారు. అవినీతి రహిత పాలన సాగిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీపై రాఫెల్ కుంభకోణమంటూ దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. ‘రాఫెల్’పై సుప్రీంకోర్టు తీర్పు రాహుల్ కు చెంపపెట్టు లాంటిదని, తాను చేసిన ఆరోపణలు తప్పని ఆయన ఒప్పుకోవాలని, సైనికులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 

More Telugu News