Telangana: మీ నాన్న కేసీఆర్ లా మొండిగా వ్యవహరించవద్దు!: కేటీఆర్ కు నారాయణ సూచన

  • ప్రతిపక్షాల అభిప్రాయాలను తీసుకోండి
  • జిల్లాల ఏర్పాటుపై కేసీఆర్ ఏకపక్షంగా వెళ్లారు
  • కేటీఆర్ కొత్త బాధ్యతలపై మాకు అభ్యంతరం లేదు

తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ ను పార్టీ అధినేత కేసీఆర్ నియమించిన సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ ను నడపడానికి కేటీఆర్ సమర్ధుడని ఈ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించారు. కేటీఆర్ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా టీఆర్ఎస్ తో పాటు మిగతా పార్టీలకు చెందిన పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా దీనిపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ కూడా స్పందించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ లా కీలక విషయాల్లో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవద్దని నారాయణ సూచించారు. తెలంగాణ ప్రజల భవిష్యత్తుకు సంబంధించి ముఖ్యమైన అంశాల విషయంలో ప్రతిపక్షాల అభిప్రాయాలను, సీనియర్ల సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాల రూపకల్పనలో ప్రతిపక్షాల అభిప్రాయాన్ని కనీసం కోరలేదనీ, జిల్లాల ఏర్పాటును సైతం మొండిగా చేపట్టారని గుర్తుచేశారు.

More Telugu News