ఆలోచనలో పడిన దిల్ రాజు .. కొత్త కథల వైపు దృష్టి
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆలోచనలో పడిన దిల్ రాజు .. కొత్త కథల వైపు దృష్టి

  • కథలపై దిల్ రాజుకి మంచి పట్టు 
  • ప్రేక్షకుల నాడి తెలిసిన నిర్మాత 
  • ఈ ఏడాది నష్టాలే ఎక్కువ
కథా కథనాలపై దిల్ రాజుకి మంచి పట్టువుంది. ఏ వర్గం ఆడియన్స్ ఏ కథలను ఇష్టపడతారనేది ఆయనకి బాగా తెలుసు. అలాగే అన్నివర్గాల ప్రేక్షకులను ఏ కథలు మెప్పిస్తాయనే విషయంలోను ఆయనకి మంచి అవగాహన వుంది. ఈ కారణంగానే ఆయన ఖాతాలో ఎక్కువ సక్సెస్ లు వచ్చి చేరుతుంటాయి.

అయితే ఈ ఏడాది దిల్ రాజు నుంచి వచ్చిన సినిమాలు ఆశించినస్థాయిలో ఆదరణ పొందలేదు. కొన్ని సినిమాలు ఆయన అంచనాలను తలక్రిందులు చేశాయి. దాంతో కంటెంట్ పరంగా వైవిధ్యం లేకపోవడమే ఇందుకు కారణమనే విషయాన్ని దిల్ రాజు గ్రహించాడట. ఈ కారణంగానే ఆయన '96' సినిమా తెలుగు రీమేక్ హక్కులను కొనుగోలు చేశాడనీ, ఇంద్రగంటి చెప్పిన కొత్తతరహా కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. కొత్త తరహా కథలవైపు దృష్టి పెట్టిన దిల్ రాజు ఎలాంటి ఫలితాలను అందుకుంటాడో చూడాలి. 
dil raju

More Telugu News