Narendra Modi: మోదీ పర్యటనల ఖర్చు... అక్షరాలా రూ. 2,012 కోట్లు!

  • పార్లమెంట్ కు తెలిపిన కేంద్ర మంత్రి వీకే సింగ్
  • మొత్తం 84 పర్యటనలు చేసిన మోదీ
  • విమానాల నిర్వహణకే రూ. 1,583 కోట్లు
భారత ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత, గడచిన నాలుగున్నరేళ్లలో ఆయన విదేశీ పర్యటనలకు అయిన మొత్తం ఖర్చు అక్షరాలా రూ. 2,012 కోట్లు. ఈ విషయాన్ని పార్లమెంట్ ప్రశ్నోత్తరాల వేళ, ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు సమాధానంగా విదేశాంగ శాఖ సహాయమంత్రి వీకే సింగ్ తెలిపారు. ఈ నాలుగున్నరేళ్లలో ఆయన 84 పర్యటనలు చేశారని చెప్పారు.

ఎయిరిండియా వన్ విమానాల నిర్వహణతో సహా సురక్షిత హాట్ లైన్ సౌకర్యాలు, తదితర ఖర్చుల కోసం ఈ మొత్తాన్ని ఖర్చు చేశామని, విమానాల నిర్వహణకే రూ. 1,583 కోట్లు ఖర్చయిందని వీకే సింగ్ వెల్లడించారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ, పలు ప్రపంచ దేశాలను చుట్టి వచ్చిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయ వ్యవహారాల్లో భారత ప్రాబల్యాన్ని పెంచేందుకు ఈ పర్యటనలు సహకరించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, జపాన్ ప్రధాని షింజో అబే, చైనా అధ్యక్షుడు జిన్‌ పింగ్‌ సహా ఎన్నో దేశాల అధినేతలతో నరేంద్ర మోదీ పలుమార్లు సమావేశం అయ్యారు.
Narendra Modi
Foreign Tours
Parliament
VK Singh

More Telugu News