Rajasthan: రాజస్థాన్ రాజకీయం: అశోక్ గెహ్లాట్ వైపు అధిష్ఠానం మొగ్గు.. సచిన్ పైలట్ వర్గీయుల ఆందోళన!

షార్ట్స్‌లో చూడండి
రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రానుంది. అయితే, సీఎం అభ్యర్థులుగా, అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ లు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో అశోక్ గెహ్లాట్ వైపే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం మొగ్గుచూపినట్టు, రాజస్థాన్ సీఎంగా ఆయన పేరు దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది.

తమకు అందుబాటులో ఉండాలని గెహ్లాట్ కు అధిష్ఠానం నుంచి ఆదేశాలు అందినట్టు సంబంధిత వర్గాల సమాచారం. ఈ క్రమంలో సచిన్ పైలట్ మద్దతుదారులు ఆందోళనకు దిగినట్టు తెలుస్తోంది. రాహుల్ గాంధీ ఫైనల్ కాల్ చేస్తానని తనతో చెప్పారని అశోక్ గెహ్లాట్ తన వర్గీయులతో చెప్పినట్టు సమాచారం.
Go Back to Shorts
Rajasthan
congress
ashok gehlat
sachin pilot

More Telugu News