kcr: కేసీఆర్ కు ఇదే ఆఖరి ప్రమాణ స్వీకారం: బీజేపీ విమర్శలు

  • ఆ పార్టీకి ఇదే చివరి ప్రభుత్వం
  • కేసీఆర్ జాతీయ రాజకీయాలను ఏం చేయగలరు?
  • కేసీఆర్ ని ఏ పార్టీలు విశ్వసించవు

తెలంగాణకు రెండోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు స్వీకరించి కొన్న గంటలైనా గడవకముందే విమర్శలు మొదలయ్యాయి. ఈ ఎన్నికల్లో కేవలం ఒకే ఒక్క సీటు సాధించిన బీజేపీకి చెందిన ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు మాట్లాడుతూ, కేసీఆర్ కు ఇదే ఆఖరి ప్రమాణ స్వీకారమని, ఆ పార్టీకి ఇదే చివరి ప్రభుత్వమని వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ వ్యాఖ్యలు చూస్తుంటే ఆయనలో ఏమాత్రం మార్పు రాలేదన్న విషయం అర్థమవుతోందని అన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపైనా ఆయన విమర్శలు చేశారు. తాడూబొంగరం లేని కేసీఆర్.. జాతీయ రాజకీయాలను ఏం చేయగలరని ప్రశ్నించారు. కేసీఆర్ ని ఏ పార్టీలు విశ్వసించవని అభిప్రాయపడ్డ కృష్ణసాగర్, ఎంఐఎంను పట్టుకుని ఊరేగుదామని కేసీఆర్ కలలు కంటున్నారని ఆరోపించారు. ఎంఐఎంను జాతీయ పార్టీగా మారుస్తానని కేసీఆర్ వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమని అన్నారు. సుప్రీంకోర్టు గురించి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపైనా ఆయన స్పందిస్తూ, దేశానికి ఒక సుప్రీంకోర్టు కాకపోతే, రాష్ట్రానికి ఒకటి ఉంటుందా? అని ఎద్దేవా చేశారు.

More Telugu News