కిషన్ రెడ్డితో పాటు మరికొందరిని బలి తీసుకున్న 'నోటా'!
- తెలంగాణ ఎన్నికల్లో నేతల రాతలను తలకిందులు చేసిన నోటా
- నోటా దెబ్బకు చిత్తయిన కిషన్ రెడ్డి, మదన్ లాల్, అద్దంకి దయాకర్
- మెజార్టీ కంటే ఎక్కువ వచ్చిన నోటా ఓట్లు
అంబర్ పేటలో టీఆర్ఎస్ అభ్యర్థి కాలేరు వెంకటేశంకు 61,558 ఓట్లు, కిషన్ రెడ్డికి 60,542 ఓట్లు వచ్చాయి. 1,016 ఓట్ల మెజార్టీతో వెంకటేశం గెలుపొందారు. ఇక్కడ నోటాకు 1,462 ఓట్టు పడ్డాయి.
ఖమ్మం జిల్లా వైరాలో స్వతంత్ర అభ్యర్థి రాములుకు 52,650 ఓట్లు, టీఆర్ఎస్ అభ్యర్థి బానోత్ మదన్ లాల్ కు 50,637 ఓట్లు వచ్చాయి. మెజార్టీ 2,013 కాగా, నోటాకు 2,360 ఓట్లు పడ్డాయి.
తుంగతుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థి అద్దంకి దయాకర్ పై టీఆర్ఎస్ అభ్యర్థి సాధించిన మెజార్టీ కూడా నోటా ఓట్ల కంటే తక్కువగానే ఉంది.