rajani: రేపే రజనీ పుట్టినరోజు .. 'పెట్టా' టీజర్ రిలీజ్

  • హిట్ టాక్ తెచ్చుకున్న '2.ఓ'
  • 'పెట్టా'పై అభిమానుల్లో ఆసక్తి 
  • సంక్రాంతికి భారీ విడుదల    
ప్రపంచవ్యాప్తంగా రజనీకాంత్ కి గల క్రేజ్ అంతా ఇంతా కాదు. అలాంటి రజనీకాంత్ పుట్టినరోజు రేపు. రజనీ పుట్టినరోజు అంటే .. ఆయన అభిమానులకు పండుగ రోజే. ఆ అభిమానులకు మరింత ఆనందాన్ని కలిగించడం కోసం రజనీ కూడా తనవంతు ప్రయత్నం చేస్తుంటారు. అందులో భాగంగానే రేపు ఉదయం 11 గంటలకు 'పెట్టా' సినిమా టీజర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు రజనీ ఇస్తోన్న ట్రీట్ ఇదేనన్న మాట.

కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రజనీకాంత్ 'పెట్టా'మూవీ చేశారు. సిమ్రాన్ .. త్రిష కథానాయికలుగా చేసిన ఈ సినిమా, సంక్రాంతికి భారీ స్థాయిలో విడుదల కానుంది. విభిన్నమైన కథాంశంతో .. ఆసక్తికరమైన కథనంతో నిర్మితమైన ఈ సినిమాపై అంచనాలు బాగానే వున్నాయి. '2.ఓ' సక్సెస్ ను ఎంజాయ్ చేస్తోన్న రజనీ అభిమానులు, 'పెట్టా' బ్లాక్ బస్టర్ హిట్ కావాలని కోరుకుంటున్నారు.    
rajani
simran
trisha

More Telugu News