Asifabad: ఆసిఫాబాద్‌లో సాంకేతిక సమస్యల కారణంగా కౌంటింగ్‌లో ఇబ్బందులు

  • మొరాయించిన ఈవీఎంలు
  • ఆగిపోయిన కౌంటింగ్
  • గెలుపొందిన ఆత్రం సక్కు
ఆసిఫాబాద్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో కాసేపు గందరగోళం తలెత్తింది. ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కు, టీఆర్ఎస్ అభ్యర్థి కోవా లక్ష్మిపై విజయం సాధించారు. అయితే ఓట్ల లెక్కింపు జరుగుతుండగా సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో 214 పోలింగ్ బూత్‌లలోని ఈవీఎంలు మొరాయించడంతో కొద్దిసేపు కౌంటింగ్ ఆగిపోయింది. సాంకేతిక సమస్యలు పరిష్కారం కాకపోవడంతో వివి ప్యాట్‌లోని స్లిప్‌లను లెక్కించిన అనంతరం ఫలితాన్ని ప్రకటించారు. ఈ నియోజకవర్గంలో 171 ఓట్ల స్వల్ప తేడాతో సక్కు గెలుపొందారు.
Asifabad
Congress
Kova Lakshmi
Atram Sakku
TRS

More Telugu News