పరకాలలో మహాకూటమికి షాక్.. ఘోరంగా ఓడిపోయిన కొండా సురేఖ!

  • టీఆర్ఎస్ నేత చల్లా ధర్మారెడ్డి ఘనవిజయం
  • పరకాల ప్రజలు నాపై నమ్మకం ఉంచారు
  • ఇచ్చిన హామీలన్నింటిని నిలబెట్టుకుంటాం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర పరాభవం ఎదురయింది. తాజాగా పరకాల నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి చేతిలో కొండా సురేఖ ఘోర పరాజయం పాలయ్యారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ.. కొండా కుటుంబం తనపై తప్పుడు ప్రచారం చేసినా పరకాల ప్రజలు నమ్మకం ఉంచారని తెలిపారు. కొండా సురేఖను పరకాల ప్రజలు నమ్మలేదనీ, తప్పుడు హామీలకు గట్టిగా బుద్ది చెప్పారని వ్యాఖ్యానించారు.

తెలంగాణ ప్రజలు తమకు మరో అవకాశం ఇచ్చారనీ, దీన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకుంటామని హామీ ఇచ్చారు. టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే కోరుట్ల, కంటోన్మెంట్, వర్దన్నపేట, జగిత్యాల, సిద్ధపేటలో విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజా అప్ డేట్స్ ప్రకారం టీఆర్ఎస్ 87 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.
Go Back to Shorts
Telangana
Telangana Assembly Results
Mahakutami
Konda Surekha
challa dharma reddy
won

More Telugu News