chiranjeevi: 'సైరా' సినిమాపై స్పందించిన నాగబాబు

  • బ్రిటీష్ వారితో తలపడిన ఉయ్యాలవాడ
  • తెలుగువారు తొలిసారిగా తెలుసుకుంటారు
  • నిర్మాతగాను చరణ్ రాణిస్తున్నాడు    
చిరంజీవి కథానాయకుడిగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'సైరా' సినిమా రూపొందుతోంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కీలకమైన సన్నివేశాలు కొన్ని చిత్రీకరించారు. తాజాగా ఈ సినిమా గురించి నాగబాబు స్పందించారు. "సిపాయిల తిరుగుబాటు కంటే ముందుగానే బ్రిటీష్ వారితో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పోరాడారు. ఆయన గురించి తెలుగు ప్రజలు ఈ సినిమా ద్వారా తొలిసారిగా తెలుసుకోబోతున్నారు.

ఈ సినిమా గురించి నాకు సురేందర్ రెడ్డి చెప్పిన దాన్ని బట్టి, ప్రేక్షకుల ఊహకి అందని స్థాయిలో ఉండనుందనే విషయం అర్థమైంది. ఈ సినిమా సంచలన విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం కలిగింది. చరణ్ హీరోగానే కాదు .. నిర్మాతగాను రాణిస్తున్నందుకు ఆనందంగా వుంది. చరణ్ కి అన్నయ్య జీన్స్ తో పాటు మేనమామ అల్లు అరవింద్ వ్యాపారపరమైన తెలివితేటలు కూడా వచ్చాయి" అని చెప్పుకొచ్చారు.  
chiranjeevi
nagababu

More Telugu News