Rajinikanth: తాండూరు కాంగ్రెస్ అభ్యర్థి ఫంక్షన్ కు హాజరైన రజనీకాంత్

  • చెన్నైలో రోహిత్ రెడ్డి కుమారుడి డోలారోహణ కార్యక్రమం
  • ఫంక్షన్లో సందడి చేసిన రజనీకాంత్
  • రజనీతో ముందు నుంచే రోహిత్ కు సత్సంబంధాలు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున తాండూరు నుంచి పోటీ చేసిన రోహిత్ రెడ్డి కుటుంబ కార్యక్రమానికి సూపర్ స్టార్ రజనీకాంత్ హజరయ్యారు. శనివారం రాత్రి చెన్నైలో రోహిత్ రెడ్డి కుమారుడి డోలారోహణ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకకు రజనీ వచ్చారు. రజనీతో రోహిత్ రెడ్డికి ముందు నుంచే సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. యంగ్ లీడర్స్ సంస్థ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రజనీని రోహిత్ పలుమార్లు కలిశారు. ఆ సమయంలో ఇద్దరి మధ్య సంబంధాలు బలపడ్డాయి. 
Rajinikanth
rohit reddy
tandur
congress

More Telugu News