తెలంగాణలో ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతోంది.. ఇందుకు కేటీఆర్ మాటలే సాక్ష్యం!: వంటేరు ప్రతాప్ రెడ్డి
- టీఆర్ఎస్ తో ఈసీ కుమ్మక్కు అయింది
- వీవీ ప్యాట్ స్లిప్పులను కూడా లెక్కించండి
- ప్రజల అపోహలను తొలగించాలని డిమాండ్
ఈ ఎన్నికల్లో గోల్ మాల్ చోటుచేసుకునే అవకాశముందని వంటేరు వ్యాఖ్యానించారు. ఈవీఎంల్లో నిక్షిప్తమైన ఓట్లతో పాటు వీవీ ప్యాట్ యంత్రాల్లోని ఓటర్ స్లిప్పులను కూడా లెక్కించాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల కోసం అధికార టీఆర్ఎస్ పార్టీతో రాష్ట్ర ఎన్నికల సంఘం కుమ్మక్కు అయిందని వంటేరు ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. తమతో పాటు తెలంగాణ ప్రజలలో నెలకొన్న అపోహలను తొలగించాల్సిన బాధ్యత ఈసీ అధికారులపై ఉందని స్పష్టం చేశారు.