Andhra Pradesh: జగన్@3,419 కిలోమీటర్లు.. శ్రీకాకుళంలో జోరుగా ప్రజాసంకల్ప యాత్ర!

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర నేడు శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతోంది. ఈ రోజు ఉదయం రాగోలు నుంచి 318వ రోజు పాదయాత్రను జగన్ ప్రారంభించారు. భారీ సంఖ్యలో అభిమానులు, మద్దతుదారులతో కలిసి జగన్ ముందుకు సాగుతున్నారు. దుసి క్రాస్‌, బావాజీ పేట, రాగోలు పేట, గట్టుముడి పేట, వంజంగి, వాకాలవలస క్రాస్‌, లంకం క్రాస్‌ మీదుగా ఈరోజు జగన్ పాదయాత్ర కొనసాగనుంది.

అనంతరం నందగిరి పేటకు చేరుకుని రాత్రికి జగన్ విశ్రాంతి తీసుకోనున్నారు. కాగా, జగన్ తమ ప్రాంతానికి రావడంతో కలుసుకునేందుకు భారీగా స్థానికులు పాదయాత్ర మార్గంలో గుమిగూడారు. వీరందరినీ కలుసుకుంటూ జగన్ ముందుకు సాగుతున్నారు. కాగా, ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా జగన్ ఇప్పటివరకూ 3,419.7 కిలోమీటర్లు నడిచారు.
Go Back to Shorts
Andhra Pradesh
Jagan
YSRCP
prajasankalpa yatra
Srikakulam District
3419 km

More Telugu News