లేదు.. నేను పార్టీ మారడం లేదు: టీడీపీ ఎంపీ అవంతి శ్రీనివాస్ స్పష్టీకరణ
- అది తప్పుడు ప్రచారం
- ఈ ప్రచారం వెనక కుట్ర ఉంది
- ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారు
గత ఎన్నికల్లో అనకాపల్లి నుంచి గెలిచిన అవంతి శ్రీనివాస్ వైసీపీలో చేరబోతున్నట్టు గత రెండుమూడు రోజులుగా విస్తృత ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన భీమిలి నుంచి పోటీ చేయబోతున్నారని, టికెట్ ఇచ్చేందుకు వైసీపీ అంగీకరించినట్టు వార్తలు షికారు చేశాయి. దీంతో స్పందించిన ఆయన అటువంటిదేమీ లేదని తేల్చేశారు. నిజానికి ఆయన ఈ ఏడాది జూన్‌లోనే పార్టీని వీడబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే, ఆ తర్వాత అవి సద్దుమణిగాయి. ఇప్పుడు మళ్లీ మరోసారి అటువంటి వార్తలే హల్‌చల్ చేస్తుండడంతో మరోమారు ఖండించారు.