KCR: మీ వ్యూహం ఫలించింది.. సీఎం మీరే!: కేసీఆర్‌ను అభినందించిన అసదుద్దీన్

  • సహకరించినందుకు కేసీఆర్ థ్యాంక్స్
  • రాష్ట్రం మొత్తం టీఆర్ఎస్ హోరే
  • నేడు ఇరువురు నేతలు భేటీ
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఫోన్ చేసి అభినందించారు. మీ వ్యూహం ఫలించిందని, మళ్లీ మీరే ముఖ్యమంత్రి కాబోతున్నారని చెప్పి అభినందనలు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం కేసీఆర్‌కు ఫోన్ చేసిన అసద్ పలు విషయాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పోలింగ్ సరళి గురించి ఇరువురు నేతలు చర్చించుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ కూడా అసద్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

ఎన్నికల ప్రచారంలో తమకు సహకరించినందుకు థ్యాంక్స్ చెప్పారు. కూటమి ఎత్తులను ఓటర్లు చిత్తు చేసి టీఆర్ఎస్‌ను ఆదరించినట్టు ఈ సందర్భంగా కేసీఆర్ పేర్కొన్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ప్రజలు స్వాభిమానాన్ని చాటారని, రాష్ట్రం మొత్తం టీఆర్ఎస్ పేరే వినిపించిందని అన్నారు. మళ్లీ తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని పేర్కొన్నారు. టీడీపీ, కాంగ్రెస్‌లు ఒక్కస్థానంలో కూడా గెలిచే పరిస్థితి లేదని కేసీఆర్ పేర్కొన్నారు.  టీఆర్ఎస్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే ఆ పార్టీకి విజయాన్ని అందించి పెడతాయని అసద్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, నేడు కేసీఆర్-అసదుద్దీన్ భేటీ కానున్నారు.
KCR
Telangana
TRS
Asaduddin Owaisi
Hyderabad

More Telugu News