ఈ అనుమానాలకు కారణం బీజేపీ, టీఆర్ఎస్ ప్రముఖులే: టీ-టీడీపీ అధికార ప్రతినిధి
- టీఆర్ఎస్ కు 60 సీట్లే వస్తాయని సర్వేలంటున్నాయి
- వంద సీట్లు ఖాయమని కేటీఆర్ ఎలా చెబుతారు?
- నాడు జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడూ ఇదే పాట పాడారు!
నాడు జీహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు ఇదే రకమైన పాట పాడారని, అసలు, ఇలాంటి అపోహలు రేకెత్తించింది టీఆర్ఎస్ పార్టీ, ప్రభుత్వమేనని విమర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నికల సంఘంపైనా ఆయన విమర్శలు చేశారు. ఓటర్ల జాబితాలో చాలా మంది పేర్లు లేవని ప్రశ్నిస్తే, అందుకు, క్షమాపణలు చెప్పి రజత్ కుమార్ సరిపెట్టుకున్నారని అన్నారు. ఈ విషయంలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని తాను తప్పుబడుతున్నానని, ఇక్కడి ఎన్నికల సంఘం ద్వారా ఇదంతా చేయించిందని, ఇదంతా, బీజేపీ ఆడించిన నాటకమని ఆరోపించారు.