Trisha: చాలా సంతోషంగా, గర్వంగా ఉంది: త్రిష

  • రజనీకాంత్‌కు జంటగా నటించాను
  • ఈ సినిమాతో నా కల నెరవేరింది
  • పల్లెటూరి గృహిణిలా త్రిష

రజనీకాంత్, త్రిష, సిమ్రన్ ప్రధాన పాత్రల్లో కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘పెట్టా’. ఇటీవలే సిమ్రన్ లుక్‌ను విడుదల చేసిన చిత్రబృందం తాజాగా త్రిష లుక్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా త్రిష సోషల్ మీడియాలో రజనీతో నటించాలన్న తన కల ఈ సినిమాతో నెరవేరిందని పోస్ట్ పెట్టింది.

‘నా కల నిజమైంది. ఒకే ఒక్క సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌కు జంటగా నటించాను. చాలా సంతోషంగా, గర్వంగా ఉంది..’ అని త్రిష పేర్కొంది. ఫస్ట్‌లుక్ పోస్టర్‌లో త్రిష చీరకట్టుతో చాలా అందంగా పల్లెటూరి గృహిణిలా కనిపించింది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Telugu News