మరో పేరు మార్పుకు సిద్ధమైన యోగి సర్కార్
- ప్రయాగ్ రాజ్ యూనివర్శిటీగా మార్చాలని నిర్ణయం
- ఆమోదముద్ర కోసం గవర్నర్ కార్యాలయానికి చేరిన ఫైల్
- ముజఫర్ నగర్ జిల్లా పేరును లక్ష్మీనగర్ గా మార్చాలంటున్న సంగీత్ సోమ్
దీనిపై ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం దినేష్ శర్మ స్పందిస్తూ... అలహాబాద్ పేరును ప్రయాగ్ రాజ్ గా మార్చినప్పుడు, అలహాబాద్ యూనివర్శిటీ పేరును కూడా మార్చాల్సిన అవసరం ఉందని తెలిపారు. యూనివర్శిటీతో పాటు ఇంటర్మీడియట్, హైస్కూల్ బోర్డుల పేర్లను కూడా మార్చాలనే డిమాండ్లు ఉన్నాయని చెప్పారు. మరోవైపు, ముజఫర్ నగర్ జిల్లా పేరును కూడా లక్ష్మీనగర్ గా మార్చాలని బీజేపీ నేత సంగీత్ సోమ్ డిమాండ్ చేస్తున్నారు.