Sonia Gandhi: సోనియా, రాహుల్ లతో భేటీ అయిన స్టాలిన్, కనిమొళి

  • సోనియాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన స్టాలిన్, కనిమొళి
  • కరుణానిధి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రావాలంటూ ఆహ్వానం
  • అనేక విషయాలపై చర్చించామన్న రాహుల్ గాంధీ
యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీలతో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, ఆ పార్టీ ఎంపీ కనిమొళి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సోనియాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. డిసెంబర్ 16న చెన్నైలో దివంగత కరుణానిధి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి రావాల్సిందిగా ఆహ్వానించారు. అనంతరం రాహుల్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ, ఇరు పార్టీల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. తమ సమావేశం మంచిగా కొనసాగిందని... అనేక విషయాలపై చర్చించామని తెలిపారు. 
Sonia Gandhi
Rahul Gandhi
stalin
kanimozhi
dmk
congress

More Telugu News