kcr: కేసీఆర్ ఎంతకైనా తెగిస్తారు: వీహెచ్ వ్యాఖ్యలు

  • ఈవీఎంలు ఉంచిన కేంద్రాల వద్ద  కాపలా కాయాలి
  • లేకపోతే ఏదైనా జరగొచ్చు
  • మా కార్యకర్తలు కాపలాగా ఉన్నారు
 కేసీఆర్ మంచీ చెడూ ఏదైనా చేయగలరని, ఆ శక్తి ఆయనకు ఉందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో ఈరోజు ఆయన మాట్లాడుతూ, ఇచ్చిన హామీలను కేసీఆర్ నిలుపుకోలేకపోవడం, నిరుద్యోగ యువత ఆయనపై అసహనం ఉండటం తదితర అంశాలు ప్రజాకూటమికి కలిసొచ్చాయని చెప్పారు. ప్రజాకూటమి ద్వారా తాము ఏకమయ్యాం కనుక, ఓట్లు చీలిపోవడానికి అవకాశం లేదని అన్నారు.

ఈవీఎంలు ఉంచిన కేంద్రాల వద్ద కాపలా కాయకుంటే ఏదైనా జరగొచ్చని వీహెచ్ అనుమానం వ్యక్తం చేశారు. తమ అధిష్ఠానం ఆదేశాల ప్రకారం, ఈవీఎంలు ఉంచిన కేంద్రాల వద్ద తమ కార్యకర్తలు కాపలాగా ఉంటామన్నారని చెప్పారు. జాతీయ సర్వేలపై తమకు నమ్మకం లేదని, లగడపాటి సర్వేపై తమకు నమ్మకం ఉందని, ఎందుకంటే, ఆయన లోకల్ వ్యక్తి కనుక అని అన్నారు. టీఆర్ఎస్ తమ అభ్యర్థులను ప్రకటించకముందే, సర్వేలు తమకు అనుకూలంగా వచ్చాయని చెప్పుకుందని, అభ్యర్థిని బట్టి సర్వే చేస్తారని అన్నారు. 
kcr
vh
TRS
prajakutami

More Telugu News