Andhra Pradesh: జగన్@ 3,416 కిలోమీటర్లు.. శ్రీకాకుళంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్ర!

షార్ట్స్‌లో చూడండి
ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్ర శ్రీకాకుళం జిల్లాలో కొనసాగుతోంది. ఈ రోజు ఆదివారంపేట రోడ్డు నుంచి 317వ రోజు పాదయాత్రను జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మద్దతుదారులు, ప్రజలను కలుసుకుంటూ జగన్ ముందుకు సాగుతున్నారు. ఈరోజు ప్రజా సంకల్పయాత్ర జిల్లాలోని కొత్తరోడ్డు జంక్షన్ మీదుగా రాగోలు వరకూ సాగనుంది. కాగా, ఈ సందర్భంగా జగన్ ను కలుసుకునేందుకు భారీగా స్థానిక ప్రజలు గుమిగూడారు. జగన్ పాదయాత్ర ఇప్పటివరకు 3,416.1 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది.
Go Back to Shorts
Andhra Pradesh
Jagan
YSRCP
Srikakulam District
PRAJASANKALPA YATRA
3416 km

More Telugu News