Andhra Pradesh: ఆంధ్రాలో రైతులు కరవుతో అల్లాడుతుంటే.. చంద్రబాబు వ్యవసాయంలో 97% అభివృద్ధి సాధించామంటున్నారు!: విజయసాయిరెడ్డి ఎద్దేవా
- చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారు
- కరవు బృందం ముందు రైతులు విలపిస్తున్నారు
- ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ నేత
ఆంధ్రప్రదేశ్ లో వ్యవసాయం, కరవు పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెబుతున్నారని వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి విమర్శించారు. ఓవైపు కరవుతో రైతులు అల్లాడుతుంటే చంద్రబాబు మాత్రం.. ‘వ్యవసాయంలో 97 శాతం అభివృద్ధి సాధించాం. ఇంత అభివృద్ధి ఇంకెక్కడయినా జరిగిందా?’ అంటూ సవాళ్లు విసురుతున్నారని దుయ్యబట్టారు.
ప్రస్తుతం ఏపీలో పర్యటిస్తున్న కేంద్ర కరవు బృందాన్ని ‘మమ్మల్ని ఆదుకోండయ్యా. అప్పుల పాలై అల్లాడుతున్నాం’ అంటూ రైతులు ప్రాధేయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో స్పందించారు.
ప్రస్తుతం ఏపీలో పర్యటిస్తున్న కేంద్ర కరవు బృందాన్ని ‘మమ్మల్ని ఆదుకోండయ్యా. అప్పుల పాలై అల్లాడుతున్నాం’ అంటూ రైతులు ప్రాధేయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో స్పందించారు.