Australia: 307 పరుగులకు ఆలౌట్‌ అయిన భారత్‌... ఆస్ట్రేలియా ముందు 323 పరుగుల లక్ష్యం

  • లంచ్‌ తర్వాత రహానే తప్ప రాణించని మిగిలిన బ్యాట్స్‌మన్లు
  • అజింక్య బ్యాట్‌ ఝళిపించడంతో పరుగులు
  • డకౌట్‌ అయిన షమీ, ఇషాంత్‌లు
అడిలైడ్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో భారత్‌ తన రెండో ఇన్నింగ్స్‌లో 307 పరుగులకు ఆలౌట్‌ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో సాధించిన 15 పరుగులతో కలిపి ప్రత్యర్థి ముందు 323 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. 151 పరుగుల ఓవర్‌నైట్‌ స్కోర్‌తో నాల్గోరోజు బరిలో దిగిన భారత్‌ భోజన విరామ సమయం వరకు పటిష్టంగా కనిపించి, ఆ తర్వాత కుప్పకూలింది. రహానే మినహా పెద్దగా ఎవరూ రాణించలేదు. షమీ, ఇషాంత్‌ డకౌట్‌ అయ్యారు. మరోవైపు అజింక్య రహానే జోరు పెంచి బ్యాట్‌కి పనిచెప్పాడు. ఆస్ట్రేలియా తరపున లైయన్‌ ఆరు వికెట్లు తీయగా, స్టార్క్‌ మూడు, హేజిల్‌వుడ్‌కు ఒక వికెట్‌ దక్కాయి.
Australia
India
adilaid test

More Telugu News