TRS: వంద స్థానాల్లో గెలుపు మాదే.. మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం: కేటీఆర్

షార్ట్స్‌లో చూడండి
దాదాపు వంద స్థానాల్లో గెలుపు తమదేనని, మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నామని  టీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ మరోసారి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఈరోజు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ,  తెలంగాణ ఎగ్జిట్ పోల్స్ లో అంచనా వేసిన దానికంటే కూడా తమకు ఎక్కువ స్థానాలు వస్తాయని, 2/3 మెజారిటీతో అధికారంలోకి రాబోతున్నామని అన్నారు.

ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్ లో పాల్గొనడమే ఒక నిశ్శబ్ద విప్లవానికి, చైతన్యానికి, ఏకపక్షంగా ప్రజలు ఇవ్వబోయే తీర్పుకు ఇది సంకేతం కాబోతోందన్నది తమ విశ్వాసమని అన్నారు. డిసెంబర్ 11న సంబరాలు చేసుకునేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని అన్నారు. ఎన్నికల్లో పాల్గొన్న ప్రజలకు టీఆర్ఎస్ తరపున ధన్యవాదాలు చెబుతున్నానని, 90 రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో అద్భుతంగా పని చేసిన తమ నాయకులు, కార్యకర్తలకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. 
Go Back to Shorts
TRS
KTR
elections

More Telugu News