sathyadev: డబ్బుచుట్టూ తిరిగే కథతో 'బ్లఫ్ మాస్టర్'

షార్ట్స్‌లో చూడండి
డబ్బే మనిషిని శాసిస్తుంది .. డబ్బే మనిషిని నడిపిస్తుంది అనే నేపథ్యంలో గతంలో కొన్ని సినిమాలు వచ్చాయి. అలాంటి నేపథ్యంలోనే మరో కోణాన్ని ఆవిష్కరిస్తూ మరో సినిమా సిద్ధమవుతోంది .. అదే 'బ్లఫ్ మాస్టర్'. సత్యదేవ్ .. నందిని శ్వేత నాయకా నాయికలుగా నటించిన ఈ సినిమాకి గోపీ గణేశ్ దర్శకుడిగా వ్యవహరించాడు. రమేశ్ పిళ్లై నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమాను, ఈ నెల 28వ తేదీన విడుదల చేయనున్నారు.

తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తించేలా వుంది. "ఈ దునియాలో డబ్బున్నోడికే విలువ .. ఎంత ఎక్కువుంటే అంత విలువ .. ఎలాగైనా డబ్బును సంపాదించాలి .. ఆ తరువాత డబ్బే డబ్బును సంపాదిస్తుంది" అని హీరో చెప్పిన డైలాగ్ ఆకట్టుకునేదిలా వుంది. "ఈ దునియాలో బతకడానికి నింగి .. నేల .. నీరు .. నిప్పు .. గాలితో పాటు డబ్బు ఆరో భూతంలా మారిపోయింది'' అనే డైలాగ్ కూడా పేలింది.
Go Back to Shorts
sathyadev
nandita sweta

More Telugu News