చంద్రబాబుతో పొత్తు పెట్టుకోకుంటే కాంగ్రెస్ కు కనీసం సానుభూతి అయినా దక్కేది!: విజయసాయిరెడ్డి
- ఈ కలుపు మొక్కతో రైతులకు నష్టం
- చంద్రబాబు రాజకీయ జీవితం ముగిసినట్లే
- ట్విట్టర్ లో స్పందించిన వైసీపీ నేత
తెలంగాణలో చంద్రబాబుతో పొత్తు పెట్టుకోకుండా పోటీ చేసున్నా కాంగ్రెస్ కు కనీసం సానుభూతి అయినా దక్కేదని విజయసాయిరెడ్డి వ్యాఖ్యానించారు. ఎక్కడా దిక్కులేక చంద్రబాబు డబ్బులతో వస్తే కాంగ్రెస్ నేతలు పెత్తనం అంతా ఆయనకు అప్పగించారనీ, ఘోర పరాజయాన్ని మూటగట్టుకోబోతున్నారని చెప్పారు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ నేతల స్వయంకృతాపరాధమేనని తెలిపారు.