తెలంగాణ ఎన్నికలను బాయ్‌కాట్ చేసిన గ్రామం.. అధికారులు బతిమాలినా కరగని ఓటర్లు
- నేతల తీరుకి నిరసనగా ఎన్నికలు బాయ్‌కాట్
- ఎన్నికలను బహిష్కరించిన మొట్ల తిమ్మాపూర్
- కలిసికట్టుగా ఉన్న గ్రామస్థులు
దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న తమ గ్రామాన్ని పట్టించుకున్న నాథుడే లేడని, హామీలన్నీ గాలికేనని గ్రామస్థులు వాపోయారు. కనీస సౌకర్యాలకు కూడా తాము నోచుకోలేదని, ఒక్క నాయకుడు కూడా తమ గ్రామాన్ని పట్టించుకోలేదేని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు పట్టించుకోని నాయకులు ఇప్పుడొచ్చి అదిచేస్తాం, ఇది చేస్తాం ఓటెయ్యండి అని చెప్పినంత మాత్రాన ఓట్లు వేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. విషయం తెలిసిన అధికారులు ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ బతిమాలినా ఓటర్లు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో అధికారులు నిరాశగా వెనుదిరిగారు.