రంగు పడింది: ఓటేసి వచ్చిన కేటీఆర్
- ఓటు హక్కు వినియోగించుకున్న కేటీఆర్
- 'ఐయామ్ ఇంక్డ్' అని ట్విట్టర్ లో వ్యాఖ్య
- అందరూ ఓటు వేయాలని పిలుపు
తెలంగాణకు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ యువనేత కె.తారక రామారావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటు వేసిన వచ్చిన తరువాత, తన వేలికున్న సిరాను చూపుతూ "నాపై రంగు పడింది (i am inked), మీపై..?" అని కామెంట్ పెట్టారు. మీరు ఇంకా ఓటు వేయనట్లయితే, వెంటనే వెళ్లి ఓటేసి రండి అని కూడా వ్యాఖ్యానించారు. కాగా, పోలింగ్ ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. మధ్యాహ్నం 12 గంటల సమయానికి 29 శాతం వరకూ పోలింగ్ జరిగినట్టు వార్తలు వస్తున్నాయి.
I am inked Are you?
Go out and vote if you haven’t already #TelanganaElection2018 pic.twitter.com/bMsrkRBttV— KTR (@KTRTRS) December 7, 2018