Chandrababu: నాడు సమైక్యాంధ్రలో బాబు చేసిందేమిటో తెలుసా? హైదరాబాద్ లోని ‘ఆల్విన్’ని అమ్మేయలేదా?: వైఎస్ జగన్

  • నాడు నిజాం షుగర్స్, పాలేరు షుగర్స్.. అమ్మేశారు
  • చక్కెర ఫ్యాక్టరీలను అమ్మేసిన పెద్దమనిషి చంద్రబాబు
  • ‘హెరిటేజ్’ కోసం చిత్తూరు డైరీనీ మూసేయించారు

నాడు సమైక్యాంధ్రలో చంద్రబాబు చేసిందేమిటో తెలుసా? అంటూ వైసీపీ అధినేత జగన్ విమర్శలు గుప్పించారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలంలోని చిలకపాలెంలో నిర్వహించిన ప్రజా సంకల్పయాత్రలో ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ లోని ‘ఆల్విన్’ని, రిపబ్లిక్ ఫోర్జ్ అనే కంపెనీని, నిజాం షుగర్స్, పాలేరు షుగర్స్, ఆదిలాబాద్ స్పిన్నింగ్ మిల్స్ ను, సిరిపూర్ పేపర్ మిల్స్ ను చంద్రబాబు అమ్మేశారని విమర్శించారు.

 మన పక్క నంద్యాల, హనుమాన్ జంక్షన్, బొబ్బిలి, ఆముదాలవలస, కొవ్వూరు సహకార రంగంలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీలను అమ్మేసిన చరిత్ర ఈ పెద్దమనిషి చంద్రబాబుదని, తన సొంత సంస్థ ‘హెరిటేజ్’ కోసం చిత్తూరు డైరీని కూడా మూసేయించిన ఘనత చంద్రబాబుదేనని జగన్ విరుచుకుపడ్డారు. 

More Telugu News